ఉస్మానియాలో లోకోపైలట్‌కు పోస్టుమార్టం

హైదరాబాద్: ఈ నెల 11న ఉదయం ఎంఎంటిఎస్ రైలు హంద్రీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 15మంది సహా లోకోపైలట్ చంద్రశేఖర్‌కి కూడా గాయాలయ్యాయి. కాచిగూడ రైలు ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయాలపాలై నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. శనివారం రాత్రి చికిత్స పొందుతూ కేర్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా పోస్టుమార్టం జరిగిన తర్వాత ఆయన మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులు స్వస్థలం అయిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తరలించనున్నారు. అతడి అంత్యక్రియలు అక్కడే జరగనున్నట్లు సమాచారం.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి: