నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు

నిన్నటి వరకు బిజెపి కి వ్యతిరేకంగా పోస్టర్ లు వెలువగా..నేడు బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. నిజామాబాద్ , జగిత్యాల జిల్లాలో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. నిజామాబాబాద్ లో నిరుద్యోగ భృతి ఎక్కడ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. నిన్న ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ఫ్లెక్సీల పక్కనే వీటిని ఏర్పాటు చేశారు. ప్రజలను ఉచితాలకు అలవాటు చేస్తున్నారంటూ దీనిలో వివరించారు. దీంతో నిజామాబాద్ లో మరోసారి పొలిటికల్ వార్ నెలకొంది.

ఇటు జగిత్యాల జిల్లాలోను బిఆర్ఎస్ వ్యతిరేకంగా పోస్టర్లు అంటించారు. ఈరోజు బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కవిత జగిత్యాలలో పర్యటిస్తుండగా..ఆమెకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మెట్ పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో వ్యంగ్యంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వంటి అంశాలను హైలెట్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు మీడియా కంట పడకముందే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన లో అపశృతి చోటుచేసుకుంది. గుండెపోటు తో బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ మృతి చెందారు. దీంతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం రద్దు చేసారు.