బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు ఊహించని షాక్‌

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య భారీ షాక్ తగిలింది. దుర్గం చిన్నయ్య కు వ్యతిరేకంగా హైదారాబాద్‌లో బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. వివిధ ఆరోపణలతో బీఆర్ఎస్ భవన్, పలు మీడియా సంస్థల కార్యాలయాల సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేతిలో ఆర్థికంగా మోస పోయామని ఆరిజన్ డైరీ బాధితులు పోస్టర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోరిక తీర్చడం కోసం అమ్మాయిలను పంపించాల్సి వచ్చిందని.. ఇదేంటని అడిగితే తమ మీద తప్పుడు కేసులు పెట్టి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆడ పిల్లలలను ఆట బొమ్మలుగా చూస్తూ వారి జీవితాలతో ఆటలాడుతున్న ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఎమ్మెల్యే ప్రజల్లో ఉంటే బీఆర్ఎస్ మీద ప్రజల్లో నమ్మకం పోవడమే గాకుండా తీవ్రంగానష్టపోవాల్సి ఉంటుందని తెలిపారు.

స్కీమ్ ల పేరుతో స్కాంలు చేస్తూ పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలను పక్కదారి పట్టిస్తూ అవినీతికి పాల్పడుతున్న వారికి అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. అతనికి వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వకూడదని ఇందులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులకు టికెట్‌ ఇచ్చినా.. గెలిపించకూడదని కోరారు