సానుకూల స్పందనే మేలు

వ్యక్తిత్వ వికాసం

Positive Feedback
Positive Feedback

ముఖ్యాంశాలు

  • ఏ విషయాలపై ఎక్కువగా స్పందిస్తారో పరిశీలించుకోండి
  • భావోద్వేగాలు అంటే అన్నీ చెడే అని అనుకోవద్దు
  • వాటిని ఎలా ఆపాలి విషయంపై అవగాహన అవసరం
  • ‘నువ్వు’ అనే మాట ఎక్కువడగా వాడకూడదు
  • మనం వారిని ఎత్తిచూపుతున్నట్టు ఉంటుంది

మీరు ఏఏ విషయాల పట్ల ఎక్కువగా స్పందిస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించండి. భావోద్వేగాలు అనగానే అన్నీ చెడే అనుకోనక్కర్లేదు. మనకు మంచిగా ఉపకరించేవీ ఉంటాయి.

ఉదాహరణకు మీలో జిజ్ఞ్ఞాస ఎక్కువ ఉంటే ఎంతో విజ్ఞ్ఞానం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీ సహ ఉద్యోగుల పట్ల మీలో ఆసక్తి, వారితో కలిసి పనిచేయాలనే ఇష్టం ఉన్నపుడు ఆఫీసుకి హషారుగా వెళ్లగలుగుతారు.

ఏదైనా సందర్భంలో కోపం, ఆవేశం, అనంగీకారం- ఇవి కలిగినపుడు వాటిని అలాగే ఉంచుకుని సమస్యని పరిష్కరించడానికి పూనుకోకూడదు.

వీటిని పక్కకు పెట్టగలిగితేనే అసలు సమస్య పరిష్కారమవుతుంది.

ఆయా భావాలు ఏ సందర్భాల్లో మీలో పెచ్చరిల్లుతున్నాయి, వాటిని ఎలా ఆపాలి అనే విషయాల మీద ఒక పరిశీలన, అవగాహన ఉండాలి.

ఎవరితోనైనా ఏదైనా విషయంపై వాదిస్తున్నపుడు మాటల్లో ‘నువ్వు అనేమాటని ఎక్కువ వాడకూడదు. ‘

నువ్వు అనే మాటతో చెప్పదలచుకున్న విషయాన్ని కూడా ‘నేను అంటూ చెప్పవచ్చు.

నువ్వు అనే పదం ఎక్కువ వాడుతుంటే ఎదుటివారికి మనం వారిని ఎత్తిచూపుతున్నట్టు ఉంటుంది.

అదే నేను ఇలా అనుకుంటున్నాను అంటే సర్దిచెబుతున్నట్టు ఉంటుంది.

ఏవైనా భావోద్వేగాలు మిమ్మల్ని కుదిపి వేస్తున్నపుడు వెంటనే వాటికి అనుగుణంగా స్పందించకుండా కాస్త విరామం తీసుకోండి.

మీలో అలాంటి భావాలను కలిగించిన సందర్భం ఏమిటో ఒక్కసారి గమనించండి. వాటిని పునరాలోచించండి.

అలా నిదానంగా ఆలోచిస్తే నెగిటివ్‌ స్పందనలు కచ్చితంగా కాస్తయినా తగ్గుతాయి.

బాగా కోపం వచ్చినపుడు లేదా దేనికైనా బాగా కలత చెందినపుడు ఆ ప్రభావం మనసుమీద, శరీరం మీద పడుతుంది.

శరీరంలో వణుకు, టెన్షన్‌ స్పష్టంగా తెలుస్తుంటాయి. ఆ సమయాల్లోనే చాలామంది కోపంతో కేకలు వేయటం, ఏడవటం చేస్తుంటారు.

ఇలాంటపుడు వెంటనే చేయాల్సిన ఆలోచన, పని- మనసుని శాంతబరచుకోవటం, అలాగే శరీరాన్ని తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకోవటం.

ఒక్కోసారి ఉద్యోగ నిర్వహణలో ఉన్నపుడు బాధ కలిగి దుఃఖం వచ్చే సందర్భాలు ఎదురు కావచ్చు. ఇటువంటపుడు సంయమనం పాటించడం చాలా కష్టంతో కూడుకున్న పని.

వెంటనే అక్కడికక్కడే కళ్ల నుంచి జలజలా నీళ్లు రాల్చడం మంచిపని కాదు.

విధి నిర్వహణలో కలిగే బాధకు పలువురు వ్యక్తులు, సంఘటనలు కారణమై ఉండవచ్చు. ఫలితం మీరు అనుభవించవలసి రావచ్చు. ఒ

కవేళ మీరే కారణమైనా వెంటనే ఏడుపులోకి వెళ్లకుండా తరువాత కర్తవ్యం ఏమిటి అనే విషయంవైపు మీ దృష్టిని మళ్లించాలి.

ఒకవేళ ఆపుకోలేని దుఃఖం కలిగితే ఎవరూ చూడకుండా జాగ్రత్తపడటం మేలు. తిరిగి చిరునవ్వుని పెదవుల మీదకు తెచ్చుకుని అందరిలోకి రండి.

ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు వెళ్లకుండా అలాంటి సందర్భాలకు, మనుషులకు దూరంగా ఉంటూ ఉంటే, ఇక ఎప్పుడైనా అలా చిక్కుకున్నపుడు ఒక్కసారిగా భయం కలుగుతుంది.

ఆయా సందర్భాలను ఎదుర్కోవటం కష్టంగా మారుతుంది.

అలా కాకుండా అవసరమైన సందర్భాల్లో వాటి నుంచి పారిపోకుండా ఎదుర్కొనేందుకు సిద్ధపడండి. ఒకటి రెండుసార్లు భయం కలగవచ్చు.

వాటిని ఎదుర్కోవటం, సంయమనం పాటించడం బాగా కష్టంగా అనిపించవచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/