ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం..పోసాని బయటకు రావాలంటూ పవన్ ఫ్యాన్స్ నినాదాలు

ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం..పోసాని బయటకు రావాలంటూ పవన్ ఫ్యాన్స్ నినాదాలు

హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ ఎదుట ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశం ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ ఫై దారుణమైన కామెంట్స్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఓ సైకో , వెధవ , లోఫర్ , లుచ్చా , వేదవనాకొడకా ఇలా నోటికి ఇదివస్తే అది మాట్లాడుతున్నాడు. ఇది చూసిన అభిమానులు తట్టుకోలేక ప్రెస్ క్లబ్ దగ్గరికి పరుగులు పెట్టారు. లోపల పోసాని ప్రెస్ మీట్ జరుగుతుంటే..బయట అభిమానులు పోసాని బయటకు రావాలంటూ నినాదాలు చేస్తున్నారు.

చిరంజీవి కూతుర్ల పై కేశినేని కామెంట్స్ చేసినప్పుడు పవన్ ఎక్కడ ఉన్నాడు.. ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదని నిప్పులు చెరిగారు పోసాని. జగన్ ను పవన్ అనరాని మాటలు అన్నారు.. ఆరోపణలు చాలా మంది పై ఉంటాయన్నారు..పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారని.. గతంలో కేసీఆర్ ను కూడా విమర్శించారని గుర్తు చేశారు.. అపుడు పవన్ కు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడని పోసాని చురకలు అంటించారు. నిన్నటి నుంచి ప్రతి సెకండ్ కు పవన్ మనుషుల ఫోన్లు వస్తున్నాయని.. బూతులు తిడుతున్నారని మండిపడ్డారు.రాజకీయాలకు , ఇంట్లో వాళ్లకు సంబంధం ఏంటి.. ? అని ప్రశ్నించారు.