ఒత్తిడితో కడుపునొప్పి సమస్యలు

Portrait of tired
Portrait of tired

ఒత్తిడితో కడుపునొప్పి సమస్యలు

ఒత్తిడితో గుండె సంబంధ వ్యాధులు, హిస్టీరియా వస్తాయని విన్నాంకాని… ఒత్తిడికీ, పొట్టకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? సంబంధం ఉంది. మెదడు నుండి పొట్టలోకి ఒక నరం ప్రవహిస్తూ ఉంటుంది. కోపం లేదా ఆందోళనగా ఉన్నపుడు ఈ నరం ఆ ప్రభావాల్ని పొట్టలోకి చేరుస్తుంది. ఇవి జీర్ణక్రియలో తోడ్పడే ప్రత్యేకమైన కణాలను ప్రభావితం చేసి, జీర్ణరసాయనాలు ఎక్కువ మోతాదులో విడుదలయ్యేలా చేస్తాయి. దీనివల్ల పొట్టలో నొప్పి, గ్యాస్‌, జీర్ణం కాకపోవడం, అసిడిటి లాంటి సమస్యలు తరచుగా తలెత్తుతుంటాయి. అనుభవజ్ఞులైన వైద్యులకు మీ సమస్య ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అందుకే సమస్య ఏమీ లేదు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి అంటూ వైద్యులు సలహా ఇస్తారు.
మరి అటువంటి ఒత్తిడి నుండి బయటపడే మార్గాలేమిటో తెలుసుకుందామా! ఆందోళన వద్దు చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన పడడం మానేయండి. మీరు చేస్తున్న పనుల మీద మనసు లగ్నం చేయండి. మీరు చేసేది కరెక్టే అయి నపుడు ఆందోళన పడాల్సిన పని లేదు కదా! ఆందోళన లేనపుడు మీ మెదడు అనవసర విషయాలతో, అవిశ్రాంతంగా, ఒత్తిడిగా, నిస్సత్తువగా లేకుండా ప్రశాంతంగా, చురుకుగా ఆలోచించగ లుగుతుంది.
ఆఫీసులో అయినా, ఇంట్లో అయినా ఇదే విధానం పనిచేస్తుంది. ఈసారి పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తినపుడు వెంటనే డాక్టర్‌ దగ్గరికి పరిగెత్తకుండా ఇలా చేసి చూడండి. తర్వాత అవసరమైతే డాక్టర్ని సంప్రదించవచ్చు. ప్రశాంతత… ప్రశాంతత రోడ్డుమీద నడిచేటపుడు, ట్రాఫిక్‌లో, మీ చుట్టూ ఉన్న వాతావర ణాన్ని చూసి ఆందోళన పడకండి. నీలివర్ణపు ఆకాశాన్ని చూడండి. గాలికి ఊగుతున్న పువ్వులను, ఆకులను గమనించండి.

మీ చుట్టూ పరు చుకుని ఉన్న ఆకుపచ్చ, ఎరుపు, పసుపు… లాంటి రంగుల వస్తువు లను పరీక్షించండి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించండి. దానిని ఆస్వాదించండి. ఉదర సమస్యలు మిమ్మల్ని బాధిస్తే అపుడడగండి. రసాయన చికిత్స మీకు వైద్యులు ఇచ్చిన చీటీలోని మందులు కొనేముందు ఒక్క నిమిషం ఆగండి. ఉత్సాహంగా ఉండే వ్యాఖ్యానాలు మీ మీద మీరే ప్రయోగించుకుని చూడండి. ‘ఈ రోజు చాలా మంచిరోజు ‘ఈ రోజు నేను ఎంతో స్నేహంగా అందరితోనూ మెలగుతాను అందరితోనూ ‘మనసువిప్పి మాట్లాడతాను, ‘అవసరమైన సందర్భాల్లో జాలి, కరుణ చూపిస్తాను లాంటి ఉత్సాహపూరిత మైన మాటలు అనుకోండి. దీనివల్ల మెదడులో కొన్ని రకాల రసాయన చర్యలు జరుగుతాయి.

వీటిలో ఉత్పన్నమయ్యే రసాయనాలు మందులు వాడకుండానే మీ సమస్యలను దూరం చేస్తాయి. రెండు పనులూ ఒకేసారి ఒకోసారి మీరు చేయాల్సిన పని ఎక్కువగానే ఉంటుంది. అలాగే విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. మానసికంగా ప్రశాంతంగా ఉండడమే విశ్రాంతి కాబట్టి పనిచేసుకునే సమయంలోనే మంద్రస్థాయిలో మంచి సంగీతాన్ని వినండి. అలాగే రెండు మూడు పనులు ఒకేసారి కాకుండా ఒకేపని మీద మీ దష్టి కేంద్రీ కరించండి. దీనివల్ల ఆందోళన లేకుండా, తక్కువ సమయంలో ఎక్కువ పనులు అయ్యే అవకాశం ఉంది. ఆందోళన లేదు కాబట్టి ఉదర సంబంధ సమస్యలూ ఉండవు.

ఆత్మ పరిశీలన మొబైల్‌ స్విచ్‌ఆఫ్‌ చేయండి, కంప్యూటర్‌ షట్‌డౌన్‌ చేసి మిమ్మల్ని మీరు నిజాయితీగా శోధించుకోండి. మీరు చేస్తున్న పనిమీద మీకు ఎంత వరకు ఏకాగ్రత ఉంది. మిమ్మల్ని మీరు ఆ పనికి తగిన శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తిగా నమ్ముతున్నారా? ఉద్యోగంలోకానీ, ఇంట్లో కానీ మీరే కీ పర్సన్‌గా భావిస్తున్నారా? ఇలా ఆలోచిస్తున్న సమయంలో కాఫీ, టీలకు బదులు చల్లని పాలు తాగండి. మీ పిల్లలు, భర్త, బంధువులు, స్నేహితులు మిమ్మల్ని, మీరు చేసే పనిని సరిగా అర్థం చేసుకోవడంలేదని వారిపట్ల కఠినంగా ఉంటున్నారా ఆలోచించండి. అలాగే మిగతా వారికంటే ఎక్కువ శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదని బాధపడేవారి విషయంలోనూ ఇది వర్తిస్తుంది.

ఇలా నిజాయితీగా ఆలోచించడం వల్ల మీ బలహీనతలు, మీరు ఎక్కడ దెబ్బ తింటున్నారో తెలుస్తుంది. దీంతో ఆందోళన వెనకపడి మానసిక ప్రశాంతంత చేకూరుతుంది. దాంతో అనవసరపు శారీరక సమస్యలు దూరమవుతాయి. చేస్తున్న పనిమీద అవగాహన తమ లక్ష్యమేంటో పూర్తి అవగాహనతో పనిచేసుకుంటూ వెళుతున్న వారిని ఉదర సంబంధ సమస్యలు బాధించిన సంఘటనలు చాలా తక్కువ. ఆ పనిలో వారు ఆనందం పొందలేకపోయినా, ఆనవసరపు ఆందోళనతో కోల్పోయేది ఏమీ లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వారిని బాధించవు. మన శారీరక ఆరోగ్యం మన మానసిక స్థితి మీదే ఆధారపడి ఉంటుంది.

మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఇలాంటి పరిస్థితులు ఉంటే మనం వాటిని పట్టించుకోకపోయినా వాటి ప్రభావం పొట్ట మీద ఉంటుంది. మన సబ్‌ కాన్షియస్‌ మైండ్‌(అంతఃశ్చేతన)లో ఉన్న ఈ ప్రభావాలు ఉదరసంబంధ సమస్యలకు దారితీస్తాయి. అందుకే మీ రోజువారీ కార్యక్రమాలు సమతుల్యంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. విరామాలు అవసరం ఒక పనికి మరో పనికి మధ్యలో కాస్త విరామం తీసుకోండి. పని- విశ్రాంతి-పని-విశ్రాంతి ఇలా సాగాలి. ఆఫీసుపనిని ఇంటికి తీసుకెళ్లకండి. అలాగే సాయంత్రాలు అలా గాలికి కూర్చుని ఎలాంటి ఆలోచనలూ, ఆందోళ నలూ లేకుండా మనసును కాసేపు ఖాళీగా వదలండి. చల్లచల్లగా, తియ్యతియ్యగా వేడి పదార్థాలను, పుల్లని పదార్థాలను వీలయినంతవరకు తీసుకోకుండా చూసుకోండి.

అన్నింటికంటే నీళ్లు చాలా శ్రేష్టమైనవి. ఎప్పుడూ నీళ్లేనా అనిపిస్తే కాస్త సోడా తాగండి. పళ్ల రసాలు శరీరారోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ తినండి కొవ్వు పదార్థాలు, పొట్టను భారంగా చేసే పదార్థాలు, నూనె పదార్థాలకు దూరంగా ఉండండి. అన్నం, పాలు, కమలాఫలాలు, దోసకాయలు, బఠానీలు, బంగాళాదుంపలు, మొలకెత్తిన ధాన్యాలులాంటివి మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. చుట్టూ ఉండే వాతావరణం మీ చుట్టూ వాతావరణం, మీ గది ప్రశాంతంగా, మీకు ఆహ్లాదాన్ని కలిగిం చేలా ఉండేట్టు మార్చుకోండి. ప్రశాంతమైన, ఉల్లాసవంతమైన వాతావరణం మిమ్మల్ని పని ఒత్తిడినుండి దూరంచేసి మీ లక్ష్యాలను, పనిని సులువుగా చేసుకునేలా సహకరిస్తుంది.

వీటన్నింటితో కలిపి ప్రతిరోజు ఉదయం లేవగానే ‘ఈ రోజు నేను నిన్నటిలా కాదు అందరినీ ప్రేమిస్తాను, వారేం చేసినా అది వారి స్వభావమని అంగీకరిస్తాను, మానసికంగా, శారీరకంగా నేను చాలా ప్రశాంతంగా ఉంటాను. గతం గతః అనుకుంటాను. ఈ రోజు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటాను. దేనికీ తొందరపడను -ఇలా అనుకోవడం వల్ల మీ రోజు ప్రశాంతంగా గడిచిపోతుంది.