పాప్ కార్న్.. ఆరోగ్యానికి మంచిదే..

స్నాక్ ఐటమ్స్ – ఆరోగ్యం

Popcorn is good for health
Popcorn is good for health

పాప్ కార్న్ ..అందరూ తినటానికి అమితంగా ఇష్టపడే స్నాక్ ఐటమ్ ..ముఖ్యంగా థియేటర్ లో సినిమా చూసేటప్పుడు చాలా మందికి ఇది చేతిలో ఉండాలసిందే ఎక్కువగా టైం పాస్ కోసం తీసుకునే ఈ స్నాక్ ద్వారా ఆరోగ్యనికి మంచి ప్రయోజనం కలుగుతుందాని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు , పాలీ ఫినోలిక్ సమ్మేళనాలు , యాంటీ ఆక్సీడెంట్స్, విటమిన్ బి కాంప్లెక్స్, , మాంగనీస్ , మెగ్నీషియం, మొదలైనవి ఆరోగ్యానికి ఉపకరించేవే .పాప్ పాపకార్న్ ..అందరూ తినటానికి అమితంగా ఇష్టపడే స్నాక్ ఐటమ్ ..ముఖ్యంగా థియేటర్ లో సినిమా చూసేటప్పుడు చాలా మందికి ఇది చేతిలో ఉండాలసిందే ఎక్కువగా టైం పాస్ కోసం తీసుకునే ఈ స్నాక్ ద్వారా ఆరోగ్యనికి మంచి ప్రయోజనం కలుగుతుందాని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే పీచు , పాలీ ఫినోలిక్ సమ్మేళనాలు , యాంటీ ఆక్సీడెంట్స్, విటమిన్ బి కాంప్లెక్స్, , మాంగనీస్ , మెగ్నీషియం, మొదలైనవి ఆరోగ్యానికి ఉపకరించేవే .

కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది.

పాప్ కార్న్ లో ఉండే పీచు పదార్ధాలు రక్త నాళాలు, ధమనుల గోడల్లో పేరుకుపోయిన కొవ్వును సమర్ధంగా తగ్గిస్తాయి. శరీరం లోని కొవ్వు స్థాయిల్లో తగ్గుదల కన్పిస్తుంది. ఫలితంగా హృద్రోగ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు చాలావరకు తగ్గిపోతాయి.

చక్కెర స్థాయి నియంత్రణ :

మన శరీరంలో తగినంత పీచు పదార్ధాలు ఉన్నపుడు అవి రక్తంలో చెక్కెర, ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్ద్దీకరిస్తూ ఉంటాయి . ఫలితంగా డయాబెటిస్ వంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. అందుకే పాపకార్న్ తినేవారితో పోలిస్తే తినని వారిలో మధుమేహంతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది .

జీర్ణక్రియ సాఫీగా :

మన శరీరంలో జీర్ణ క్రియ ప్రక్రియ సాఫీగా సాగాలన్నా,, మనామ్ తీసుకునే ఆహారంలో తగినన్ని పీచు పదార్ధాలు ఉండటం తప్పనిసరి. ఖ్పుడే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసి, మలబద్ధకం వంటి సమస్యలను దరి చేరనీయకుండా చేస్తుంది . పాప్ కార్న్ లో అధిక శాతం ఉండే పీచు పదార్ధాలు పేగుల పనితీరును మెరుగు పరిసి జీర్ణ క్రియ సాఫీగా సాగేలా చేస్తాయి .

బడుగు తగ్గటానికి :

బరువు తగ్గాలని చాలామంది ఆరోచిస్తూ ఉంటారు . ఆయా పదార్ధాలు ఆహారంగా తీసుకుంటే తిరిగి, బరువు పెరిగిపోతామనే భయం ఉంటుంది.. బరువు తగ్గాలనుకునే వారు పాప్ కార్న్ ను నిస్సందేహంగా తినవచ్చు. ఇందులో ఎక్కువ మొత్తం లో ఉండే పీచు పదార్ధాలు అధిక సమయం కడుపు నిండుగా అనిపించేలా చేయటం మాత్రమే కాకుండా ఆకలికి కారణమయ్యే గ్రెలిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి కాకుండా ఆపుతాయి. తద్వారా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. దీంతో తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటాం . అలాగే ఒక కప్పు పాప్ కార్న్ లో 30 కెలోరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి వీటిని ఎవరైనా తీసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/