ఇంగ్లీష్‌ మీడియంలో పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు

V. Vijayasai Reddy
V. Vijayasai Reddy

అమరావతి: టిడిపి నాయకులు పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరంటూ వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాలో చంద్రబాబు మరియు పవన్‌ కళ్యాణ్‌ ఇంగ్లీష్‌ మీడియం వద్దంటూ చేస్తున్న విమర్శలకు ప్రతిగా విజయసాయిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మతం మార్చటానికే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నారని వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఇంకా కిరసనాయిలు మాటలు, రాతలు, చూస్తుంటే చంద్రబాబుకు ఆరు నెలలుగా నిద్ర పడుతున్నట్లు లేదు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఒటమితోనే అవినీతి నిలిచి పోయింది. అసూయ, కడుపుమంట, మానసిక క్షోభతో మైండ్‌ కంట్రోల్‌ తప్పినట్లుంది. ఇంగ్లీష్‌ మీడియం మతం మార్చటానికట! పేద పిల్లలను చదువుకోనిచ్చేలా లేరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/