పది గంటలకు నమోదైన పోలింగ్‌ శాతం

voters
voters

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఐదో విడత పోలింగ్‌ జరుగుతుంది. అయితే జమ్మూకశ్మీర్‌, బెంగాల్‌లోని కొన్ని చోట్ల మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 7 రాష్ట్రాల్లోని 51 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఉదయం పది గంటల సమయానికి ఆయా రాష్ట్రాల్లో

నమోదైన పోలింగ్‌ శాతం ఇలా ఉంది.


బిహార్‌లో : 11.51శాతం
జమ్ముకశ్మీర్‌లో : 0.97శాతం
ఝార్ఖండ్‌లో : 13.46శాతం
మధ్యప్రదేశ్‌లో : 12.86శాతం
రాజస్థాన్‌లో : 44.62శాతం
ఉత్తరప్రదేశ్‌లో : 14శాతం
పశ్చిమబెంగాల్‌లో: 16.56శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు వెల్లడించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/