‘బుట్టబొమ్మ’ విసిరిన ఛాలెంజ్ !

డాన్స్ బిట్ ను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్

Pooja hegde’s-new-challenge

సౌత్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమా ‘అరబిక్ కుత్తు’ ప్రస్తుతం యూట్యూబ్ లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది. ఈ హవా ను కొనసాగించానికి యూనిట్ సిద్ధమైంది. . అందులో భాగంగా ఒక డాన్స్ బిట్ ను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి అంటూ ఛాలెంజ్ ను స్టార్ట్ చేసింది. కాగా, పూజా హెగ్డే మొదటగా ఆ ఛాలెంజ్ ను విసురుతూ వీడియోను చేసి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. పాటలో విజయ్ కి ఏమాత్రం తగ్గకుండా పూజా హెగ్డే డాన్స్ తో దుమ్ము రేపింది. అద్బుతమైన అందాలతో పాటు పాటలో ఆమె ఆకట్టుకునే స్టెప్పులను చాలా సింపుల్ గా చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పూజా అందాల విందు హాట్ టాపిక్ గా మారింది. డాన్స్ తో అరబిక్ కుత్తు స్థాయిని మరింతగా పెంచిన పూజా హెగ్డే ఒక హిప్ స్టెప్పును మీరు చేయండి అంటూ చాలెంజ్ విసిరింది.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/