తెలుగమ్మాయిని అయిపోయా:పూజా హెగ్డే

Pooja Hegde

త్రివిక్రమ్ గారు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. ఆయన నుంచి నేను ఓర్పుగా ఉండటం నేర్చుకున్నా. ఏ సీన్ అయినా చాలా వివరంగా చెప్తారు. ఆఖరుకు పాటలో ప్రతి లైన్ అర్థాన్నీ చెప్తారు. ఆయన్లోని గొప్ప గుణం ఈగో లేకపోవడం” అని చెప్పారు పూజా హెగ్డే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుండు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో ఆమె కథానాయికగా అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో పూజా హెగ్డే సంభాషించారు. ఆ విశేషాలు…

‘ఆలా వైకుంఠపురములో..’ ని మీ క్యారెక్టర్ కు మీరే డబ్బింగ్ చెప్పుకోవడం ఎలా అనిపిస్తోంది?
చాలా కష్టం. ఎందుకంటే తెలుగు నా ఫస్ట్ లాంగ్వేజ్ కాదు. ఇంగ్లీష్ పదాల్ని తెలుగులో చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదేమైనా నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకోవడం నా పర్ఫార్మెన్స్ మరింత ఎలివేట్ కావడానికి ఉపయోగపడుతోంది. డబ్బింగ్ కు సమస్య కాకుండా సీన్స్ తీసేటప్పుడు డైలాగ్ ఎలా చెప్పాలో నేర్చుకున్నా. ‘అల..వైకుంఠపురములో’ ని అమూల్య పాత్ర తో నేను మరింతగా తెలుగమ్మాయిని అయిపోయాను. బాలీవుడ్ జనాలు నన్ను హైదరాబాద్ అమ్మాయిననే అనుకుంటున్నారు.

‘అరవింద సమేత’కు కూడా మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు కదా? అప్పటికీ ఇప్పటికీ మీ డబ్బింగ్ లో వచ్చిన మార్పేమిటి?
తెలుగు లైన్స్ ను అర్థం చేసుకొని వాటిని ఎలా చెప్పాలో తెలుసుకుంటున్నా. ఓవర్ యాక్టింగ్ చెయ్యడం నాకిష్టం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పడం వల్ల ఒక్కోసారి మనం ఓవర్ యాక్టింగ్ చేసినట్లు అనిపిస్తుంది. నేను పర్ఫార్మ్ చేసిన దానికి ఆ డబ్బింగ్ డిఫరెంట్ గా ఉన్నట్లు ఫీలవుతాను. కొంతమంది మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్స్ మన పర్ఫార్మెన్స్ ను తమ డబ్బింగ్ తో మరింత ఎలివేట్ చేస్తారు. వాళ్లను నేను గౌరవిస్తాను. ‘అరవింద సమేత’ రిలీజయ్యాక ఒకరు “ఈ సినిమాకు మీకెవరు డబ్బింగ్ చెప్పారు? నేను కూడా చెప్పించుకుందామని అనుకుంటున్నా” అని మెసేజ్ పెట్టారు. అది నా డబ్బింగ్ కు లభించిన పెద్ద కాంప్లిమెంటుగా భావిస్తాను. అంటే ఒక తెలుగు అమ్మాయిలా అందులో మాట్లాడగలిగానని సంతోషం వేసింది.

త్రివిక్రమ్ గారిని గురూజీగా మీరు సంబోధించారు. ఎందుకని?
నేను వర్క్ చేసిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ గారు చాలా కామ్ డైరెక్టర్. డైరెక్టర్ ఎనర్జీయే సెట్లో కనిపిస్తుంది. ఏ డైరెక్టర్ అయినా గట్టి గట్టిగా అరుస్తుంటే నేను భయపడతాను. ఎవరి వత్తిళ్లు వాళ్లకుంటాయి. సెట్లో డైరెక్టర్ నవ్వుతూ, ప్రశాంతంగా కనిపిస్తే, మన స్ట్రెస్ తగ్గిపోతుంది. తాను పెద్ద సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ని అని తెలిసినా, దాన్ని ఆయన బయట ప్రదర్శించరు.

అల్లు అర్జున్ గారితో డాన్స్ చెయ్యడం కష్టమనిపించేదా?
ఈ మూవీలో నాకు డ్యాన్సింగ్ ఎక్కువ లేదు. అన్నీ సింపుల్ స్టెప్సే. రిహార్సల్స్ కూడా చెయ్యలేదు. కాబట్టి బన్నీతో మ్యాచ్ కావడానికి నేను కష్టపడలేదు. నేను కెరీర్ మొదట్లోనే హృతిక్ రోషన్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వంటి గ్రేట్ డాన్సర్స్ తో చేశాను. ఇప్పుడు మళ్లీ హిందీలో హృతిక్ రోషన్ తో చేస్తున్నా. వాళ్లందరితో నేను డాన్సుల్లో మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నా.

సినిమాలో మీ ఫేవరేట్ సీన్ ఏమిటి?
నిజానికి సినిమాలో ‘బుట్టబొమ్మ’ సాంగ్ లీడ్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే బోర్డ్ రూమ్ సీన్ కూడా ఇష్టం. ఆ రెండూ చాలా ఫన్నీగా ఉంటాయి.

చాలామంది హీరోలతో పనిచేసినా బన్నీకి ఫ్యాన్ అని చెప్పారు. ఎందుకని?
నేను అతని వర్క్ కు అభిమానిని. అతనితో కలిసి పనిచెయ్యడాన్ని ఎంజాయ్ చేస్తాను. అలాగే ప్రభాస్ తో పనిచెయ్యడాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నా.

ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటే, కష్టమనిపించడం లేదా?
నాలుగు సినిమాలు ఒకేసారి చెయ్యగల కెపాసిటీ నాకుంది. ఇప్పుడు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాను కాబట్టి ఇంకో రెండు సినిమాలు హిందీలో చెయ్యగలను. ఇండియన్ స్టార్ కావడం నా లక్ష్యం. ఏదో ఒక భాషకే పరిమితం కావాలని నేననుకోవట్లేదు. నన్ను ఎవరు యాక్సెప్ట్ చేస్తే, అక్కడ సినిమాలు చెయ్యాలనుకుంటున్నా.

తెలుగులో మీరు దాదాపు టాప్ హీరోయిన్. హిందీలో సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలు చేస్తున్నారెందుకని?
‘హౌస్ ఫుల్ 4’లో నేను చేసింది సెకండ్ హీరోయిన్ రోల్ కాదు. సగం అక్షయ్ కుమార్ తోటీ, సగం రితేశ్ దేశ్ ముఖ్ తోటీ చేశాను. నేను అప్పటి దాకా స్లాప్ స్టిక్ కామెడీ చెయ్యలేదు. అందువల్ల ఆ సినిమా చెయ్యడం గొప్ప అనుభవం. ఆ అనుభవం నాకు ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఉపయోగపడింది. సీన్లో పది మంది పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఎలా మనం మన పాత్రను రక్తి కట్టించాలనేది ఆ సినిమాతో నేర్చుకున్నా. మీ లెక్కల ప్రకారం ఇప్పుడు నేను చేస్తున్నవేవీ సెకండ్ హీరోయిన్ రోల్స్ కావు. 2019లో నేను చేసిన పాత్రల్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. అవన్నీ ఒకదానికొకటి భిన్నమైన పాత్రలు. ‘గద్దలకొండ గణేశ్’లో నన్ను శ్రీదేవిలాగా అంగీకరించారు. ‘మహర్షి’లో కాలేజ్ స్టూడేంట్ గా, కార్పొరేట్ గాళ్ గా ఆదరించారు. ఇప్పుడు ‘అల వైకుంఠపురములో’ బన్నీ బాస్ రోల్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ రోల్స్ లో ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్ చెయ్యడం హ్యాపీ. వర్సటాలిటీ నా బలమని నమ్ముతాను.

విమెన్ సెంట్రిక్ రోల్స్ ఏమైనా వచ్చాయా?
తెలుగులో విమెన్ సెంట్రిక్ రోల్స్ తక్కువగానే ఉన్నాయి. ఒకటి అలాంటి స్క్రిప్ట్ వచ్చింది కానీ నేను సంతకం చెయ్యలేదు. ఏదైనా నాకు నచ్చి, నేను చెయ్యగలననిపిస్తే చెయ్యడానికి సిద్ధమే. ఒక నటిగా నన్ను మరో కోణంలో అది చూపిస్తుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/