‘రాధేశ్యామ్’ లో టీచర్ గా !

పూజా హెగ్డే పాత్ర కథలో కీలకం

pooja hegde
pooja hegde

ప్రభాస్  చేస్తున్న సినిమా రాధేశ్యామ్. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ను కూడా రివీల్ చేశారు.

సాదారణంగా అయితే ఫస్ట్ లుక్ లో కేవలం హీరోను మాత్రమే చూపుతారు. కానీ రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ లో మాత్రం ప్రభాస్ పూజా హెగ్డే రొమాంటిక్ లుక్ ను చూపించారు.

ఫస్ట్ లుక్ లొనే పూజా హెగ్డే ను చూపించడం తో ఆమె పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉన్నట్లుగా చెప్పకనే చెప్పారు.

రాధేశ్యామ్ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించబోతుందట. సినిమాలో ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

పీరియడిక్ రొమాంటిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం ఉంది. 

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/