కెసిఆర్‌, బిజెపి తోడుదొంగలు

Ponnam Prabhakar
Ponnam Prabhakar

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత, మాజా ఎంపి పొన్నం ప్రభాకర్‌ బిజెపిపై మండిపడ్డారు. తెలంగాణ బిజెపి నేతలు కొత్త బిచ్చగాళ్లు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఐదేళ్లలో తెలంగాణకు బిజెపి ఏం చేసింది? అని ప్రశ్నించారు. కెసిఆర్‌, బిజెపి తోడుదొంగలు అని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌ కనుసన్నల్లోనే బిజెపి రాష్ట్రశాఖ పనిచేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌ను ఎవరూ వీడరన్నారు. బిజెపి పట్ల అప్రమత్తంగా ఉండాలనిపొన్నం ప్రభాకర్ సూచించారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/