కేంద్రం బిల్లులతో రైతులు కూలీలుగా మారే ప్రమాదం

Ponnam Prabhakar
Ponnam Prabhakar

హైదరాబాద్‌: రైతులకు వ్యవసాయ బిల్లులు ఉరితాళ్లుగా మారనున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్పొరేట్ వ్యవసాయానికి పెద్దపీట వేసేందుకు మోడి ప్రభుత్వం కొత్త బిల్లులు తెచ్చిందన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక వ్యవసాయ బిల్లులు తెచ్చి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేంద్ర బిల్లులతో రైతులు కూలీలుగా మారే ప్రమాదం ఉందన్నారు. సన్నాలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.2,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/