పొంగులేటి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడా..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..అతి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు ఖమ్మం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మం జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పేరుంది. ఎంపీగా సేవలు అందించిన పొంగులేటి..జిల్లాలో ఎంతో మంచి పేరు ఉంది. కాగా కొద్దీ నెలల క్రితం నుండి అధికార బిఆర్ఎస్ పార్టీ ఫై విమర్శలు చేస్తూ ..ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పటు చేస్తూ అభిమానులను , తన కార్యకర్తలను కలుస్తూ వస్తున్నారు. కాగా ఈయన బిజెపి లో చేరబోతారని , లేదు లేదు కాంగ్రెస్ లో చేరబోతారని , మరికొంతమంది YSRTP లో చేరబోతారని ఇలా ఎవరికీ వారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్ చేసారని , కాంగ్రెస్ లో చేరాలని కోరినట్లు తాజాగా వినిపిస్తున్న వార్త.

అయితే.. రాహుల్ గాంధీ నుంచి పొంగులేటికి ఫోన్ వచ్చిందనే విషయం ఇప్పుడు ఖమ్మం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన్ను బీజేపీలోకి తీసుకెళ్లేందుకు అమిత్ షా వంటి నేతలు ప్రయత్నించినట్టు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా రాహుల్ గాంధీ నుంచి ఫోన్ రావడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే.. ఖమ్మంలో బీఆర్ఎస్‌కు ఇబ్బందులు తప్పవనే టాక్ ఉంది. మరి నిజంగానే పొంగులేటి కాంగ్రెస్ లో చేరతారా..లేదా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.