పరిషత్ ఎన్నికలకు 11గంటలకు నమోదైన పోలింగ్

హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత ఎంపిటీసీ, జడ్పీటీసీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా జరుగుతుంది. తొలివిడతలో భాగంగా రాష్ట్రా వ్యాప్తంగా 2,097 ఎంపీటీసీలకు, 195 జడ్పీటీసీలకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు వివిధ జిల్లాల్లో పోలింగ్ వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 43 శాతం, మహబూబ్నగర్లో 41 శాతం, వనపర్తిలో 42 శాతం, నాగర్ కర్నూల్లో 37 శాతం, నారాయణ పేట 41.66 శాతం, ఖమ్మంలో 42 శాతం, భద్రాద్రి కొత్త గూడెంలో 49 శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. మరి కొన్ని జిల్లాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telengana/