పోలింగ్‌ అధికారి గుండెపోటుతో మృతి

Heart Attack
Heart Attack


బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద విషాదం నెలకొంది. పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ నంబరు 48 వద్ద విధుల్లో ఉన్న ఓ పోలింగ్‌ అధికారి గుండెపోటుతో మృతిచెందాడు. మృతుడు హనూరులోని ఓ కాటేజి ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కర్ణాటకలో 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/