జార్ఖండ్‌లో ఉదయం 9 గంటల వరకూ నమోదైన పోలింగ్‌

Jharkhand polls
Jharkhand polls

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ శాసనసభకు మూడవ దశలో జరుగుతున్న పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకూ 12.89 శాతం ఓట్లు పోలయ్యాయి. 8 జిల్లాల్లోని 17 నియోజక వర్గాల్లో పోలింగ్‌ జరుగుతున్నది. మొత్తం 56,18,267 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ) వినయ్‌కుమార్‌ చౌబే చెప్పారు. 32 మంది మహిళలతో సహా 309 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని ఆయన అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/