8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్
నోటిఫికేషన్ జారీ

Amaravati: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఈ నెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 8వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 10వ తేదీన ఫలితాలు ప్రకటించనున్నారు. అవసరమైన చోట్ల 9న రీపోలింగ్ నిర్వహించనున్నారు.
గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిన చోట నుంచే ప్రక్రియ కొనసాగనుంది. ఇదిలావుంటే 126 జడ్పీటీసీ స్థానాలు, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమైన సంగతి తెలిసిందే.
513 జడ్పీటీసీ స్థానాలకు, 7,230 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. జడ్పీటీసీ ఎన్నికల్లో 2,092 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల్లో 19,002 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/