180 మంది కోసం మంచుకొండల్లో పోలింగ్‌ కేంద్రాలు…


సిక్కిం: దేశవ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. లోక్‌సభ ఎన్నికల వేళ సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది.తూర్పు సిక్కిలంలోఏర్పాటు చేసిన రెండు పోలింగ్‌ కేంద్రాలు వార్తల్లో నిలిచాయి. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఈ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. తూర్పు సిక్కిం ప్రాంతంలోని జ్ఞాతంగ్‌ మంచుకొండపై…సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. జ్ఞాతంగ్‌ మచోంగ్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్‌ కేంద్రాలు ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించాయి. ఇండో-చైనా సరిహద్దుల్లో ఈకేంద్రాలు ఉన్నాయి. ఇక్కడి వాతావరణం గురించి తెలిసినవారు ఈ ప్రాంతంలో పోలింగ్‌ నిర్వహించడం సాహసమే అంటున్నారు. దట్టంగా మంచుకమ్ముకొని ఉండటంతో పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు పడ్డారట.మరో 48 గంటలు మంచు కురియడంతో పాటు వర్షం పడే ఛాన్స్‌ కూడా ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు సున్న డిగ్రీ ఉష్ణోగ్రతలో పనిచేసే పోలింగ్‌ సిబ్బంది…ఎన్నికల సామాగ్రితో పాటు రగ్గులు, స్వెట్టర్లు కూడా తీసుకెళ్లారు.

తాజా జాతీయ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/indian-general-election-news-2019/