కర్ణాటకలో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్

Voting
Voting

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు వేసేందుకు బారులు తీరారు. ఈ ఎన్నికలలో 37 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్, జెడిఎస్ నుంచి 17 మంది ఎంఎల్‌ఎలు బిజెపిలో చేరడంతో కుమారాస్వామి ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. ఆ ఎంఎల్‌ఎలపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేశారు. దీంతో 224 ఉన్న అసెంబ్లీ స్థానాలు 207కు చేరుకున్నాయి. బిజెపి నేత యడ్యూరప్ప 106 సీట్లతో బలపరీక్షలో నెగ్గి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం బిజెపి తన ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 7 స్థానాలలో విజయం సాధించాలి.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/