రాజకీయ కక్ష చట్టం కన్నా భయానకం

DK Shivakumar
DK Shivakumar

బెంగళూరు: కర్ణాటకలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసిన వీడియో ఒకటి ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ కేసులో శివకుమార్ ను న్యాయస్థానం 10 రోజుల పాటు కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. ఇక తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను పోస్ట్ చేసిన శివకుమార్ ఖిరాజకీయ కక్షసాధింపు దేశంలోని చట్టాలకన్నా ఎంతో బలమైనదిఖి అని వ్యాఖ్యానించడం వినిపిస్తోంది. ఇదే వీడియోలో శివకుమార్ వెనుక ఓ పోలీసు కూడా కనిపిస్తున్నాడు. కర్ణాటక ప్రజలను ఉద్దేశించి తాను మాట్లాడాల్సి వుందని, అందుకు అనుమతి ఇవ్వాలని శివకుమార్ చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన గంటల వ్యవధిలో ఈ వీడియో విడుదల కావడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా, మంగళవారం నాడు శివకుమార్ ను మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/