రాజకీయ పార్టీలు ఓటర్లను కోనుగోలు చేశాయి

all parties
all parties

సైఫాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావం చేయడానికి వివిధ రాజకీయ పార్టీలు ఓటుకు 500 నుంచి 5000 వేల వరకు వందలాది కోట్ల రూపాయలు పంపిణి చేశాయని దళిత బహుజన పార్టీ ఆరోపించింది. అలాగ వేలాది రూపాయలు విలువగల కానుకులను ఓక్కొక్క ఓటరుకు పంపిణి చేయడం జరిగిందని శుక్రవారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. కార్పోరేట్‌ స్దాయిలో ఎన్నికల వ్యాపారం జరిగిందని, అధికార పూర్వకంగా పోలీసులు సుమారు 150 కోట్ల రూపాయులు పట్టుకోవడం జరిగితే అనధికార పూర్వకంగా వందల కోట్ల రూపాయలు రవాణా జరిగిందని ఆరోపించారు. దళిత బహుజనుల రాజకీయ చైతన్యాన్ని అగ్రకుల రాజకీయ పార్టీలు నోట్ల కట్టలతో మోసం చేశాయని, వీటిని నిరోధించడంలో ఎన్నికల కమిషన్‌, అధికారులు విఫలం చెందారని విమర్శించారు. 6వ తేదీ అర్ధరాత్రి నుంచి 7వ తేదీ మధ్యాహ్నం వరకు టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి, టిడిపి పార్టీలు ఓటర్లను డబ్బులతో కోనుగోలు చేశాయని రాజ్యాంగ లక్ష్యంను తుంగలో తోక్కాయని పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్ధను అపహాస్యం చేశాయని, అధికార పార్టీ 40 లక్షల ఓట్లును గల్లంతు చేసిందని ఆయన ధ్వజమెత్తారు. అధికార పార్టీ ఎన్నికల అధికారులతో కుమ్మకైందని, అణగారిన కులాల నేతృత్వంలోని పార్టీలను పూర్తిస్ధాయిలో అణిచివేసిందని, అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో దళిత బహుజనులు అశలపైన నీళ్లు పోశాయని ఆయన ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపోందించి చట్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.