అభ్యర్థులు, ప్రత్యర్థులు అంతా వారేనా?

Political leadership
Political leadership

అభ్యర్థులు, ప్రత్యర్థులు అంతా వారేనా?

ప్రతిపక్షాలు లేవనుకున్న కెసిఆర్‌కు అసంతప్తులు, టికెట్లు ఆశించిన వారికి రానట్లయితే వారే ప్రత్యర్థులుగా మారనున్నారా? అలాంటివారిని ఎంత బుజ్జగించినప్పటికీ పదవి లేదనే బాధతో మిగి లిన వారికి (ఎమ్‌ఎల్‌ఎ అభ్యర్థి) మద్దతునిస్తారా? కెసిఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలు మంచివే. కానీ అవి దక్కాల్సినవారికి దక్క లేదనే అసంతప్తి చాలా మందిలో దాగి ఉంది. పింఛన్ల పెంపు దల బాగానే వుంది. కానీ వద్ధుల విషయంలో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ చాలా బాధకరంగా ఉందని చెప్పాలి. 60 ఏండ్లు పని చేసుకుని బతుకుతున్నవారు వేలిముద్రలు పడక రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

దళితులకు 3ఎకరా ల భూమి ఇవ్వలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వలేదని, ఆత్మీయ భవనం ఇవ్వలేదని నిరుత్సాహంతో, అసంతప్తితో ఉన్నారు. 2014 మేనిఫెస్టోలో చెప్పినట్లు దళితుడిని ముఖ్య మంత్రిని చేయలేదనే నిరాశలో ఉన్నారు. దే శ చరిత్రలో ఏ మూలన చూసినా కొత్త రాష్ట్రాల్లోగానీ, పాత రాష్ట్రాల్లోగానీ నాలుగేండ్లు ప్రతిపక్షాలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించిన పార్టీ టిఆర్‌ఎస్‌ నాయకుడు కెసిఆర్‌. అయితే 2014 ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి గెలి చినవారు కూడా టిఆర్‌ఎస్‌లో చేరడం గొప్ప విషయమే. ప్రతి పక్షాలు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు ప్రత్యర్థులు సొం తింటిలోనే తయారయ్యే పరిస్థితి కన్పిస్తుంది. ఆనాడు ప్రతి పక్షాల తరపున గెలిచిన ఎమ్‌ఎల్‌ఏలు టిఆర్‌ఎస్‌లో చేరు తుంటే ఎంతో సంతోషం కలిగింది. మరి ఈరోజు పరిస్థితులు సం కటంగా మారబోతున్నాయా? ఇతర పార్టీల నుండి గెలిచిన వారు ఆరోజు ముఖ్యమంత్రిగారు చేస్తున్న అభివద్ధిని చూసిన వచ్చామన్నారు. అభివద్ధిని చూసి వచ్చారా? లేక ఇంకేమైనా రాజకీయ లబ్ధికొసం వచ్చారా? అనేది సెకండ్‌ థాట్‌.

ప్రతిపక్షా లు లేవనుకున్న కెసిఆర్‌కు అసంతప్తులు, టికెట్లు ఆశించిన వారికి రానట్లయితే వారే ప్రత్యర్థులుగా మారనున్నారా? అలాం టివారిని ఎంత బుజ్జగించినప్పటికీ పదవి లేదనే బాధతో మిగి లిన వారికి (ఎమ్‌ఎల్‌ఎ అభ్యర్థి) మద్దతునిస్తారా? కెసిఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలు మంచివే. కానీ అవి దక్కాల్సినవారికి దక్క లేదనే అసంతప్తి చాలా మందిలో దాగి ఉంది. పింఛన్ల పెంపు దల బాగానే వుంది. కానీ వద్ధుల విషయంలో బయోమెట్రిక్‌ సిస్టమ్‌ చాలా బాధకరంగా ఉందని చెప్పాలి. 60 ఏండ్లు పని చేసుకుని బతుకుతున్నవారు వేలిముద్రలు పడక రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దళితులకు 3ఎకరా ల భూమి ఇవ్వలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇవ్వలేదని, ఆత్మీయ భవనం ఇవ్వలేదని నిరుత్సాహంతో, అసంతప్తితో ఉన్నారు. 2014 మేనిఫెస్టోలో చెప్పినట్లు దళితుడిని ముఖ్య మంత్రిని చేయలేదనే నిరాశలో ఉన్నారు

లక్ష ఉద్యోగాల్లో యువత, ఉద్యోగార్థులు, విద్యార్థులు అసంతప్తితోనే ఉన్నారు. ఏ చిన్న నోటిఫికేషన్‌ ఇచ్చినప్పటికీ అది ఏదో రకమైన లీగల్‌ ప్రాబ్లం వల్ల కోర్టులో పెండింగ్‌ ఉండటం ఉద్యోగార్థులను కాస్త నిరాశకు గురి చేస్తున్న సమస్య. కొన్ని ప్రభుత్వ రంగ సంస్థ ల్లోని వారికి అధికంగా జీతాలు పెంచడం, మరికొన్నివాటిని అసలే పట్టించుకోకపోవడం, ఐఆర్‌ ఇవ్వకపోవడం- ఇవన్నీ ఉద్యోగస్థుల్లో (ఎన్‌జీఓస్‌లో) కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రభుత్వం పంపిణీ చేసిన ట్రాక్టర్లలో నూటికి నూరు శాతం టిఆర్‌ఎస్‌ నాయకులకు, వారికి సంబంధించిన వారికే వచ్చాయని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్ప డ్డాయి. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కూడా సరిగ్గా సమయానికి అందలేదు. చాలావరకు ఇంజినీరింగ్‌ తదితర కళాశాలలు మూతపడ్డాయి. దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు 0/0 ద్వారా జీతాలు అందుతున్నాయి. జీతాలు కూడా పెరిగాయి. కాంట్రాక్టు అర్చకులుగా పనిచేస్తున్న వారిని, కింది స్థాయి సిబ్బందిని రెగ్యులర్‌ చేయడం సంతోషకరమైన విషయమే. కాంట్రాక్టు పద్ధతిలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న విద్యుత్‌ కార్మికలనుౖ రెగ్యులర్‌ చేయడం సమంజసమే. న్యాయవాదులకు 100 కోట్లు కేటాయించడం, 2 లక్షల వరకు హెల్త్‌ స్కీమ్‌ ప్రవేశపెట్టడం సమంజసమే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో న్యాయవాదులే కీలకపాత్ర పోషించిన విషయం విధితమే. ఇక ముఖ్యంగా ”రైతు బంధు పథకం. ఈ పథకం ద్వారా గుంట భూమి ఉన్నవాళ్లకు కూడా 100 రూపాయలు పంపిణీ చేసారు.

అయితే కౌలుదార్లు అసంతప్తి చెందారు. భూమి ఉన్నవారు నూటికి యాభై శాతం వ్యవసాయం చేయ రనే మాట ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే పంట పండించి నష్టపోయేది కౌలు రైతులేనని మరో వాదన. కాబట్టి మాకే ఆ పథకం వర్తింపజేయాలనేది కౌలురైతుల కోరిక. కానీ కౌలు రైతులను రికార్డుల్లోకి ఎక్కించటమన్నది, గుర్తించటమన్నది సాధ్యంకాని పని. అయితే ఎకరం, రెండెకరాలు ఉన్నట్టువంటి సన్నకారు రైతుకంటే భూస్వాములకే ఎక్కువ లాభం జరిగిందని ప్రజల్లో కొంత అపోహ ఉంది. మొత్తంమీద ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు రైతులను పట్టించుకున్నది లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, టిఆర్‌ఎస్‌ అధిష్ఠానం రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ‘రైతు బీమా మరొక ప్రయోగమేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ రైతు చనిపోతే వారం రోజుల్లోనే ఎల్‌ఐసి ద్వారా 5,00,000(అక్షరాల అయిదు లక్షలుమాత్రమే) రైతు కుటుంబానికి చెల్లించడం రైతు కుటుంబాలకు ఒక గొప్ప వరమే.

అదేవిధంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పేదింట్లో పెండ్లికి పెద్ద చేయూత. రేషన్‌లో ఒక్క రూపాయికి కిలో బియ్యం మాట అటుంచితే మునుపటి మాదిరిగా (గతంలో మాదిరిగా) లభించిన వస్తువులు లేకపోవటం ఇబ్బంది కలిగించే విషయమే. గ్రామల్లో రేషన్‌ షాపుల్లో బయో మెట్రిక్‌ సిస్టమ్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ సిగ్నలింగ్‌ (సెల్‌ సిగ్నల్స్‌) ద్వారా ఇవ్వడం వల్ల రోజుల తరబడి పనులు వదిలేసుకుని రేషన్‌ షాపుల చుట్టూ తిరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతు న్నారు. ఇలాంటి విషయాల్లో గ్రామాల్లో నివసించే ప్రజలు కాస్తంత అసంతప్తిగా ఉన్నారని దినపత్రికల ద్వారా, మీడియా లో వస్తున్నటువంటి వార్తల వల్ల సమాజానికి అర్థమయిపోతూ నే ఉంది. ఏది ఏమయినప్పటికినీ ఏ రాజకీయ పార్టీ పెట్టనటు వంటి పథకాలను ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.మరి ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన సర్కారును మళ్లీ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలనుకోవడం ప్రజల తప్పు కాదు. మంచి నిర్ణయమే. కానీ అందరూ అలానే అనుకుంటే ఫరవాలేదు. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా, ఒక్కో కోణంలో ఆలోచిస్తున్నారు. కుల సంఘాలకు భవనాలు, ఆర్థిక సహాయం చేసిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ దళితులనెందుకు పట్టించుకోవడం లేదు. ఒక్కో కులాన్ని కనుక అందులోని ఓటర్లను, జనాభాను పరిశీ లించినట్లయితే దళితుల జనాభా, వారి ఓట్లే ఎక్కువుంటాయి కదా! మరి మమ్మల్నెందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని కాస్త అసంతప్తితోనే ఉన్నట్లు కన్పిస్తున్నారు. దళితుణ్ణి సి.ఎమ్‌. చేస్తానన్న కెసిఆర్‌ అప్పట్నుంచి ఇప్పటివరకు తమ మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని భావిస్తున్నారు. ఎస్‌.సి. సామాజిక వర్గానికి చెందిన ఓట్లు చీలిపోయే అవకాశం కన్పిస్తుంది. దళితు ణ్ణి సిఎమ్‌ చేస్తే ఆ స్థానంలో దళితులను చూడలేకనా! అనే భావన ఎస్‌.సి. సామాజిక వర్గంలో నాటుకుపోయి ఉండొచ్చు.

అందుకే దొరల పాలన అని అనుకుంటున్నారేమో! సరయిన కారణం ఉంటే చెప్తే కెసిఆర్‌ ఆలోచనలను నెగెటివ్‌గా తీసుకోరు కదా జనాలు. ప్రతి ఒక్కరిలో ఇలా ఉండకపోవచ్చు. కానీ ఎక్క డో, ఎవరో ఒకరిద్దరు ఇన్ని కోణాల్లో ఆలోచించే అవకాశం లేక పోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే 9 నెలల ముందు ముం దస్తు ఎన్నికలకు పోవడమెందుకని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తు న్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్‌, తెలుగు దేశం, బిజెపి, సిపిఎం లాంటి జాతీయ పార్టీలు, వైఎస్సార్సీ, జనసేనతో సహా ప్రాంతీయ పార్టీలయిన టిజెఎస్‌ లాంటి కొత్త పార్టీలు కూడా వాటి పనుల్లో అవి మునిగిపోయా యి. అసెంబ్లీ స్థానాలకుగాను ఒక్కొక్కరిగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి.

జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు కూడా కలిసిపోయి ఉమ్మ డిగా తమ అభ్యర్థులను నిలబెట్టి టిఆర్‌ఎస్‌పై మూకుమ్మడిగా దాడి చేసి తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానాన్ని, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నాయి. ఏ వ్యక్తికి ఎక్కడ గెలిచే అవకాశముందో అక్కడే ఒక్కొక్క పార్టీ నుండి టిక్కెట్లు ఇవ్వాలని సమాలోచనలు చేస్తున్నాయి. కానీ ఒక్క ఒరలో రెండు కత్తులు ఇమడలేవు. మరి ఇన్ని పార్టీలు కలిసి ప్రభు త్వాన్ని నడిపిస్తాయా? ఒకరికి ఒకరు మద్దతు ఇస్తారా? వీటిల్లో కూడా గ్రూప్‌ రాజకీయాలు, వర్గపోరులు లేవనుకోవద్దు. ఎందు కంటే ప్రతి ఒక్కరికి పదవి ఆకాంక్ష ఉంటుంది. తెలంగాణ తెచ్చినందుకు మళ్లీ టిఆర్‌ఎస్‌ పార్టీ సిఎమ్‌ కుర్చీ కైవసం చేసుకుంటుందని, 100కు పైగా స్థానాలు సాధిస్తుందని టిఆర్‌ ఎస్‌ అధిష్ఠానం ఎన్నికల నిర్వహణకు సమా యత్తమవు తోంది. ప్రతిపక్షాలు, చిన్న,పెద్ద పార్టీలు కలిసి ఉమ్మడిగా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తామని ఉవ్విళ్లూరుతోంది. ఒకరి మీద ఒకరు నెగెటివ్‌ షేడ్స్‌ బయటికి తీసి తామంటే తామే విజయం సాధిం చాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్కొక్క రంగాన్ని ఒక్కోపార్టీ ఆయుధాలుగా వాడుకునే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాయి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ అంటే విలువ లేకుండా మాట్లాడారు కెసిఆర్‌ అని కాంగ్రెసోళ్లు, విద్యార్థిసంఘాలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులు, నిరుద్యోగులు, తెలంగాణ రావడానికి చేసిన పోరాటంలో అసు వులు బాసిన విద్యా ర్థులకు ఎంతమాత్రం న్యాయం జరగలే దని, ఉద్యోగాలకు నోటి ఫికేషన్లు కూడా ఆశించిన స్థాయిలో కాకుండా 2014 ఎన్నికల మేనిఫోస్టోలో చెప్పినలక్ష ఉద్యోగా లుగానీ, ఇంటికో ఉద్యోగం కానీ ఎవరికిచ్చారని విద్యార్థి సంఘా లు, తెలంగాణ జనశక్తి పార్టీ కోదండ రామ్‌, వైఎస్‌ఆర్‌సిపి తెలంగాణలో లేనప్పటికీ వై.ఎస్‌. మీద అభిమానంతో కొన్ని స్థానాలయినా దక్కిం చుకోకపోతామని జగన్‌, ఇక జనసేన పవన్‌కళ్యాణ్‌ ఎప్పుడు ఏ పార్టీకి మద్దతిస్తాడో తెలియని రీతిలో మాట్లాడుతాడో తెలియని ”జనసేన అధినేత, ప్రజా సంఘాలు, సిపిఎం లాంటి పార్టీలు కూడా ఎవరి దారిలో వారు వాగ్దానాలు చేస్తున్నారు. మరి ఇన్నిటిని దాటుకొని, ఇంతమంది కూటమిని, దాటుకొని జనబలంతో టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని నిలబెడుతుందా? లేదా చిన్న, పెద్ద పార్టీలన్నీ కలిసి టిఆర్‌ఎస్‌ ను ఓడించి ప్రభుత్వాన్ని నడిపిస్తాయా? జనాలు మారితే రాజకీయ సమీకరణాలు మారుతాయి వేచి చూడాలి.

శ్రీనివాస్‌ పర్వతాల, (రచయిత: న్యాయవాది)