సిద్దూ, రాజకీయాల నుండి ఎప్పుడు తప్పుకుంటారు?

ట్విట్టర్‌ ద్వారా నెటిజన్ల ప్రశ్నలు

siddhu
siddhu

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేథిలో ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని వ్యాఖ్యానించిన పంజాబ్‌ మంత్రి, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూకి నెటిజన్ల నుంచి హీట్‌ మొదలైంది. సిద్ధూ తన మాట ఎప్పుడు నిలబెట్టుకుంటాడు? రాజకీయాలకు రాజీనామా చేస్తున్నారా ?లేదా అంటూ నెటిజన్లు ట్విట్టర్లో ఆయనపై ప్రశ్నల వర్షం కురుస్తుంది.
అమేథిలో బిజెపి అభ్యర్థి ,కేంద్ర మంత్రి స్మృతి ఇరానిపై రాహుల్‌ 50 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అమేథిలో రాహుల్‌ ఓడితే రాజకీయ సన్యాసం సీకరిస్తానంటూ సవాల్‌ విసిరారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/