శంషాబాద్‌ సిద్దులగుట్ట మహిళది ఆత్మహత్యే!

ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాలు

Women Burnt Dead Body
Women Burnt Dead Body

హైదరాబాద్‌: శంషాబాద్‌ సిద్దులగుట్ట దేవాలయం సమీపంలో . ఓ మహిళను దుండగులు పెట్రోలు పోసి తగలబెట్టారని ప్రచారం జరిగింది. దీనిపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఆ మహిళది ఆత్మహత్యగా ప్రాథమికంగా గుర్తించామని ప్రకాశ్ రెడ్డి చెబుతున్నారు. ఆమె ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ సమయంలో ఆమె ఓ ప్రాంతంలో ఆగి స్థానికులతో మాట్లాడిందని, తాను తన కుటుంబ సభ్యుల కోసం వేచి చూస్తున్నానని చెప్పిందని తెలిపారు. సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా త్వరలోనే మరిన్ని పూర్తి వివరాలు తెలుపుతామని ఆయన తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/