పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళన..స్టేషన్ కు బేడీలు వేసిన పోలీసులు

పోలీస్‌ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నం

police station
police station

హైదరాబాద్‌: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులు ప్రస్తుతం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వందల సంఖ్యలో నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. అయితే ఏమాత్రం వెనక్కి తగ్గని నిరసనకారులు పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. స్టేషన్ గేటును మూసేశారు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో… దానికి బేడీలు వేశారు. పీఎస్ గేటుకు బేడీలు వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/