అసెంబ్లీ సమావేశాలకు విస్తృత బందోబస్తు

గుంటూరు రూరల్‌ జిల్లా ఎస్పీ విశాల్‌ గున్ని వెల్లడి

Guntur Rural SP Vishal Gunni
Guntur Rural District SP Vishal Gunni

Amaravati: వెలగపూడి సచివాలయంలో సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లపై రూరల్‌ ఎస్సీ విశాల్‌ గున్నీ సమీక్షించారు.

అసెంబ్లీ పరిసర ప్రాంతాలను అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌, ఇతర అధికారులతో ఆయన సమీక్షించారు.. ఇతర జిల్లాల నుంచి వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి రూరల్‌ఎస్పీ బ్రీఫింగ్‌ నిర్వహించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడారు.. అసెంబ్లీ బందోబస్తు నిమిత్తం 4గురు అదనపు ఎస్సీలు, 20 మంది డిఎస్పీలు, 58 మంది సిఐలు, 9 మంది ఆర్‌ఐలు, 88 మంది ఎస్‌ఐలు, 7గురు ఆర్‌ఎస్‌ఐలు, 8 మంది ఉమెన్‌ ఎస్‌ఐలు బందోబస్తులో ఉంటారన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/