చంద్రబాబు, జగన్‌ నివాసాల వద్ద పోలీసు బందోబస్తు

Chandrababu , YS Jagan
Chandrababu , YS Jagan

గుంటూరు: ఏపి సిఎం చంద్రబాబు, వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌ ఇద్దరి నివాసాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. అయితే రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది. కానుక ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలుపొందిన అభ్యర్థులు వెంటనే ఆయా పార్టీల అధినేతల ఇళ్లు, కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముందస్తుగానే చంద్రబాబు, జగన్‌ నివాసాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరు నేతల ఇళ్లు, కార్యాలయాలు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఉన్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల ఇళ్ల వద్ద ఏపీఎస్‌పీతో పాటు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు భారీ భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం రాత్రి నుంచి వీరి నివాసాల వద్ద ఏపీ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఏపీఎస్‌పీ)కి చెందిన రెండేసి కంపెనీలు పహరా కాస్తాయి. స్థానిక పోలీసులు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/