ఏనుగు తిన్నది పైనాపిల్‌ కాదట..వెలుగులోకి కొత్త విష‌యం

కొబ్బరికాయలో పేలుడు పదార్థాలు నింపి ఏనుగుకు తినిపించిన దుండగులు

Elephant death in Kerala

తిరువతనంతపురం: కేరళలో గర్భంతో ఏనుగు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈఘనటలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ తినడంవల్ల ఏనుగు చిన‌పోయింద‌ని ఇప్ప‌టివ‌ర‌కు అందరూ భావిస్తుండ‌గా.. ఏనుగు తిన్నది పైనాపిల్ కాద‌నే విష‌యం తాజాగా వెల్ల‌డ‌య్యింది. ఏనుగు మ‌ర‌ణించింది పేలుడు ప‌దార్థాలు కూర్చిన కొబ్బ‌రిబోండాం తిన‌డం వ‌ల్ల‌న‌ని అటవీశాఖ అధికారి సునీల్‌ కుమార్‌ వెల్లడించారు.

ఏనుగు హ‌త్య కేసుకు సంబంధించి సాక్ష్యాల సేకరణలో భాగంగా అధికారులు నిందితుడిని పేలుడు పదార్థాలు తయారు చేసే ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్క‌డ కేసు ద‌ర్యాప్తున‌కు అవ‌స‌ర‌మైన సాక్ష్యాల‌ను సేక‌రించారు. అనంత‌రం పోలీసులు వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. ప్ర‌స్తుతం త‌మ అదుపులో ఉన్న నిందితుడు విల్సన్ చెట్ల నుంచి రబ్బరు తీసేప‌ని చేసేవాడ‌ని చెప్పారు. ఇటీవ‌ల‌ మరో ఇద్దరితో క‌లిసి నాటు బాంబులు తయారు చేస్తున్నాడ‌ని, ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారని, త్వరలోనే వాళ్ల‌ను కూడా పట్టుకుంటామ‌ని తెలిపారు.పాల‌క్క‌డ్, దారి ప‌రిస‌ర ప్రాంతాల ప్ర‌జ‌లు.. క్రూరమైన అడవి జంతువుల నుంచి తమ పంటలను రక్షించుకునేందుకు పేలుడు ప‌దార్థాల‌ను నింపిన పండ్లు, జంతువుల కొవ్వు ఉప‌యోగిస్తారు. ఈ క్రమంలో పేలుడు పదార్థాలు నింపిన కొబ్బరి బోండాన్ని ఏనుగు తినడంతో దాని నోటికి తీవ్ర గాయ‌మైంది. దీంతో గ‌త‌ కొన్ని రోజులుగా ఆహారం, నీరు తీసుకోకుండా ఇబ్బంది పడింది. ఈ క్ర‌మంలో నొప్పి భ‌రించ‌లేక‌ పాలక్కాడ్‌లోని వెల్లార్ నదిలోకి దిగిన ఏనుగు.. రోజంతా అలాగే ఉండి నీరసంతో చ‌నిపోయింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/