హైదరాబాద్ వాసులకు షాకింగ్ న్యూస్..

న్యూ ఇయర్‌ వేడుకల విషయంలో హైదరాబాద్ వాసులకు భారీ షాక్ ఇచ్చారు. న్యూ ఇయర్‌ పార్టీల్లో డీజేలకు అనుమతులు లేదని ప్రకటించారు కొత్త కమిషనర్‌ ఆనంద్‌. పబ్‌ లు, రెస్టారెంట్ల కు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందుకు గురి చేయవద్దని… స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా నిమయ నిబంధనాలను పాటిస్తూ.. వేడుకలు చేసుకోవాలని.. ఈవెంట్లకు పరిమితి మించి పాసులను జారీ చేయవద్దని తెలిపారు. అలాగే పార్టీల్లో డ్రగ్స్‌ పట్టుబడితే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు

మరోపక్క రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ.. ఉత్వర్వులు ఇచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తున్న క్రమంలో పలు రాష్ట్రాలు ఆంక్షలు పెడుతున్నాయనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక, నూతన సంవత్సర వేడుకలపై కొన్ని రాష్ట్రాలు నిషేధం విధించాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరి రేపు కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.