కశ్మీర్‌లోఎన్‌కౌంటర్‌..బాలుడిని రక్షించిన ఆర్మీ

3-year-old boy saved by J&K policeman

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని సోపోర్‌ జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటు ఒక పౌరుడు చనిపోయాడు. పౌరునితోపాటు మూడేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. ఈ ఎన్‌కౌంటర్‌ నుంచి బాలుడిని ఓ పోలీసు అధికారి కాపాడారు. ఆ బాబుకు బుల్లెట్లు దిగకుండా తన ప్రాణాలను అడ్డుగా పెట్టి.. రక్షించాడు. కాగా సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ చేస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారని కశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇవాళ్టి ఎదురు కాల్పుల్లో ఒక జవాన్‌తో పాటు, ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత మూడు నెలల్లో ఇది రెండో దాడి అని ప్రకటనలో చెప్పారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/