పోలీసు నియామక ప్రతిపాదనలు

పోలీసు నియామక ప్రతిపాదనలు
Police recruitment proposals

Amaravati: రాష్ట్రంలో 340 ఎస్సై, 11వేల 356 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతివ్వాలంటూ ప్రభుత్వానికి పోలీసు నియామక మండలి ప్రతిపాదనలు పంపించింది. అన్ని ప్రభుత్వోద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్‌ విడుదల చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఖాళీల వివరాలను పంపించింది. ప్రస్తుతం చాలా ఖాళీలు ఉండటంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తున్నందున ఉద్యోగాల భర్తీకి అనుమతివ్వాలని కోరింది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటివరకూ రెండుసార్లు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు .

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/