సిఎం రమేశ్‌ ఇంట్లో పోలీసుల సోదాలు

MP CM Ramesh
MP CM Ramesh

కడప: టిడిపి ఎంపి సిఎం రమేశ్‌ ఇంట్లో శుక్రవారం(ఈరోజు) ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాదాపు 30 మంది పోలీసలు ఈ దాడులో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేశ్‌ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో సీఎం రమేశ్‌తో పాటు, ఆయన సోదరుడు సురేశ్‌ నాయుడు ఇంట్లోనే ఉన్నారు. మూడంతస్తుల భవనంలో పోలీసులు అణువణువూ సోదాలు చేపట్టారు.
సెర్చ్‌ వారెంట్‌ ఉందా? అని సీఎం రమేశ్‌ ప్రశ్నించగా.. పోలీసులు మిన్నకుండిపోవడం గమనార్హం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని మాత్రం చెప్పారు. దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. అనంతరం సీఎం అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/