కమల్‌ హాసన్‌ను విచారించిన పోలీసులు

భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో ప్రమాదం..పోలీసుల ముందు హాజరు

Chennai police interrogation to kamal haasan
Chennai police interrogation to kamal haasan

చెన్నై: ప్రముఖ హీరో కమల్‌ హాసన్‌ చెన్నై పోలీసుల విచారించారు. భారతీయుడు షూటింగ్‌ సమయంలో సెట్‌లో ఉన్న భారీ క్రేన్‌ పడిపోయి ముగ్గురు మృతి చెందిన ఘటన మనందరికీ తెలిసిందే. కాగా సినిమా షూటింగ్ సమయంలో దర్శక, నిర్మాతలు ప్రొడక్షన్ టీమ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.ఈ ఘటనలో పలువురు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 19న ఈవీపీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ఈ దుర్ఘటపై దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది.

అయితే చిత్ర యూనిట్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాద ఘటన జరిగిందనే దానిపై చెన్నై పోలీసులు భారతీయుడు 2 చిత్ర యూనిట్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే లైకా ప్రొడక్షన్‌కు సంబంధించిన వాళ్లతో పాటు చిత్ర దర్శకుడు శంకర్‌‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిచి ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై విచారిస్తున్నారు. తాజాగా చెన్నై పోలీసులు ఖభారతీయుడు 2గ హీరోగా నటిస్తున్న కమల్ హాసన్‌ను పిలిచి ఈ ఘటనపై ఆయన్ని ప్రశ్నించారు. కమల్ హాసన్.. మాత్రం పోలీసులు తనను ఘటనకు సంబంధించిన విషయాలను అడిగినట్టు చెప్పుకొచ్చాడు. ఈ ప్రమాద ఘటనలో కృష్ణ (34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ (60), శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (28) ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/