వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు పోలీసుల నిరాకరణ

బాలకృష్ణ నటించిన వీర సింహ రెడ్డి చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 12 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 06 న ఒంగోలు లోని ఏబీఎం కాలేజ్ గ్రౌండ్స్‌ లో గ్రాండ్ గా నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు ప్రాథమికంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అలానే సోషల్ మీడియా ద్వారా నందమూరి అభిమానులకి ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదికపై సమాచారాన్ని పోస్టర్స్, టీజర్స్ ద్వారా తెలియజేసింది. కానీ ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్‌ కు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉందని… దీంతో కొన్ని గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కార్యక్రమ వేదికను ఒంగోలుకు వెలుపల నిర్వహించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో గతంలో మహానాడు జరిగిన ప్రాంతంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని యూనిట్ భావిస్తోంది. మరోపక్క అభిమానులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.