కొలంబోలో సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆత్మహత్య!

Suicide
Suicide

కొలంబో: కొలంబో సీనియర్‌ పోలీస్‌ అధికారి శ్రీలంక ప్రధాని రనిల్‌ విక్రమసింఘే అధికారిక నివాసంలో నిధులు నిర్వర్తిస్తున్న పోలీస్‌ అధికారి దిల్‌రుక్ష సమరసింఘే ఈరోజు ఉదయం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కొలంబో పేజ్ వెబ్‌సైట్ ఓ కథనంలో పేర్కొంది. అయితే స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగంలో సీనియర్ పోలీస్ కమాండోగా వ్యవహరిస్తున్న దిల్‌రుక్ష సమరసింఘే టెంపుల్ ట్రీకి సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ దగ్గర తనను కాల్చుకున్నారు. తీవ్రగాయాలతో ఉన్న అతన్ని కొలంబో నేషనల్ హాస్పిటల్ కి తరలించగా..అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు అధికారి ఒకరు తెలిపారు. సమరసింఘే ఆత్మహత్యకు గల కారణాలు ఏమి తెలియదని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/