టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ హౌస్ అరెస్ట్!

దెందులూరు: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. చింతమనేనిని గృహనిర్బంధం చేశారు. టీడీపీ నేతలు ఈరోజు పోలవరం యాత్రను చేపట్టారు. పోలవరం నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. చింతమనేనితో పాటు నిమ్మల రామానాయుడు, పితాని, గన్ని వీరాంజనేయులు తదితరులు నిర్బంధంలో ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/