ఏపి సచివాలయం ముట్టడికి యత్నం

ముళ్ల కంచె వేసి అడ్డగించి పోలీసులు

protesters
protesters

అమరావతి: ఏపిలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు పెల్లుబుకుతున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా విద్యార్థులు సైతం ర్యాలీలు చేపట్టారు. మందడం వై జంక్షన్‌ వద్ద సచివాలయం ముట్టడికి విద్యార్థులు, రైతులు యత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. సచివాలయం వెళ్లే మార్గానికి ముళ్ల కంచె అడ్డుగా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ నిరసనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా పోలీసు వలయాలను నెట్టుకుంటూ రైతులు, విద్యార్థులు ముందుకు పోతున్నారు. రోడ్లపై బైఠాయించిన విద్యార్థులు ప్రభుత్వాని వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. వీ వాంట్‌ జస్టిస్‌ అంటూ పెద్దగా నినాదాలు చేశారు. సచివాలయం మార్గాలను మూసివేయగా విద్యార్థులు మందడంవైపు ర్యాలీగా వెళ్లగా అక్కడ కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రైతుల వాగ్వాదానికి దిగారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/