కేరళ వరుస హత్యల్లో చిన్నారులు బాధితులే!

jolly
jolly

తిరువనంతపురం: కేరళలోని కోజికోడ్‌ సామూహిక హత్యోదంతంలో షాకింగ్‌ ట్విస్ట్‌ వెల్లడయింది. తన భర్త, కుమార్తె సహా ఆరుమందిని ఒకేసారి మట్టుబెట్టిన ప్రధాన నిందితురాలు జాలీ థామస్‌ను విచారించిన పోలీసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆరుమంది కుటుంబ సభ్యులను చంపిన జాలీ షాజు మరో ఇద్దరు చిన్నారులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ విషయాన్ని నిందితురాలు స్వయంగా వెల్లడించినట్లు కోజికోడ్‌ రూరల్‌ ఎస్సీ సిమోన్‌ వెల్లడించారు. కోజికోడ్‌ జిల్లా పొన్నమట్టంలో నివసించే జాలీ థామస్‌ 14 కిందట తన అత్త అణ్నమ్మ థామస్‌ను హత్య చేసింది. భోజనంలో కొద్దికొద్దిగా విషాన్ని కలుపుతూ ఆమెను హత్య చేసింది. ఆ ఘటన చోటు చేసుకున్న నాలుగేళ్ల తరువాత అణ్నమ్మ థామస్‌ భర్ద టామ్‌ థామస్‌ గుండెనొప్పితో బాధపడుతూ చనిపోయారు. ఇది సహజ మరణమేనని కుటుంబసభ్యులు భావించారు. 2011లో తన భర్త రా§్‌ు థామస్‌ను కూడా హత్య చేసింది.

అయితే రా§్‌ు థామస్‌పై విష ప్రయోగం జరిగినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలో వెల్లడయింది. 2014లో అణ్నమ్మ థామస్‌ సోదరుడు మాథ్యూ సైతం అదే తరహాలో మరణించారు. ఇది జాలీ పనిని ఎవరికి అనుమానం రాలేదు. ఆ తరువాత జాలీ షాజు అనే యువకుడిని రెండో వివాహం చేసుకున్నారు. తన పేరును జాలీషాజుగా మార్చుకున్నారు. రెండో భర్త షాజ దగ్గరిబంధువుల కుటుంబంలో ఇద్దరు చిన్నారులపై విష ప్రయోగం చేసినట్లు విచారణలో వెల్లడయింది. దీంతో షాక్‌కు గురైన పోలీసులు వారి రక్తంలో సైనెడ్‌ అనవాళ్లు లభించాయని సిమోన్‌ చెప్పారు. ప్రస్తుతం జాలీ తమ కస్టడీలో ఉందని వారు పేర్కొన్నారు. కస్టడీ ముగిసాక న్యాయస్థానంలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ కేసును తీవ్రంగా పరిగణించాలని టామ్‌ థామస్‌, షాజీ కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. జాలీకి మరణశిక్ష విధించాలని పట్టుబడుతున్నారు. అయితే ఈ కేసులో జాలీకి సిపిఎం స్థానిక నాయకుడు ఒకరు మద్దతుగా నిలిచారు. ఈ హత్యలన్నింటికి జాలీనే కారణమనడానికి సాక్ష్యాధారాలు లేవంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఉన్న తీవ్రతను బట్టి సిపిఎం ఈ ఆరోపణలను తీవ్రంగా పరగణించింది. కేససును పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆ నాయకుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/