చనిపోయిన వ్యక్తిపై బీహార్‌ పోలీసులు కేసు

dead body
dead body

శాంతిభద్రతలకు విఘాతం కలిగించాడని ఎఫ్‌ఐఆర్‌


పాట్నా: ఐదేళ్లక్రితం చనిపోయిన వ్యక్తిపై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసిన వింతవైనం వెలుగులోనికి వచ్చింది. పాట్నాజిల్లాలోని బార్మ్‌లో ఈ ఏడాది జనవరిలో ఈస ంఘటనచోటుచేసుకుంది. అజ§్‌ుకుమార్‌, మరో ఐదుగురిపై బార్‌ఓలీసులు డిర్ఫాఇసి 107 సెక్షన్‌కింద కేసులు నమోదుచేసారు. ఈ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తున్నట్లు వారు ఆరోపించారు. కేసునమోదుచేసి సబ్‌డివిజన్‌కోర్టుకు తెచ్చారు.వెంటనే కోర్టుసైతం వీరిని సెప్టెంబరు 11వ తేదీలోపు హాజరుకావాలని నోటీసులు జారీచేసింది.

అజ§్‌ు తండ్రి రామ్‌క్రిత్‌ యాదవ్‌ ఈ నోటీసు అందుకుని గతవారం ఆశ్చర్యపోయారు. తనకుమారుడిని కోర్టుకు హాజరుకావాలని ఆ సమన్లలో ఉంది. స్థానిక పోలీసులను, అధికారులను ఎలా సర్దిచెఆ్పలో తనకు అర్ధం కాలేదని, తన కుమారుడు అజ§్‌ు చనిపోయాడని, ఐదేళ్లక్రితమే చనిపోయిన వ్యక్తిపై ఇపుడు కోర్టుకు తీసుకురావాలని సమన్లుజారీచేస్తే ఎలా సాధ్యం అవుతుందని తండ్రి బార్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసులో ఐదుగురితోపాటు తనకుమారడిపేరు కూడా ఉందని, మేమంతా ఒకే కులానికి చెందినవారమని, బార్‌పోలీసులు ఎలాంటి తనిఖీలు, పరిశీలనలేకుండాకోర్టుకు పంపించారని రామ్‌క్రిత్‌ మీడియాకు వివరించారు. అజ§్‌ుతోపాటు మరో ఐదుగురిని కోర్టుకు సెక్షన్‌ 107 కింద నివేదించారు. స్థానిక దేవాలయాన్ని సందర్శిస్తున్న భక్తులనుంచి విరాళాలు వసూతుచేసారన్న ఆరోఫనలున్నాయి. బార్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఒ సంజీత్‌కుమార్‌ పోలీసులు ఈకేసులో ఎలంటిపరిశీలనచేయలేదని అంగీకరించారు. అజ§్‌ుకుమార్‌కు నోటీస్‌ జారీచేసినమాట వాస్తవమేనని, మరో ఐదుగురికికిసైతం సమన్లు వెళ్లాయని జనవరినెలలోనే ఈకేసు కోర్టుకువెళ్లిందని వెల్లడించారు. మానవతప్పిదాన్ని సరిచేస్తామన్నారు. కనీసం ఆరుగురిపైకేసునమోదుచేసి సబ్‌డివిజనల్‌కోర్టుకు నివేదించామని, సిఆర్‌పిసి సెక్షన్‌ 107 కింద కేసులునమోదుచేసామన్నారు. ఇప్పటికీ బీహార్‌రాష్ట్ర మతపరమైన ట్రస్ట్‌ కింద పెండింగ్‌లోనే ఉందని, మతపరమైన రటస్టుకింద ఎలాంటి సహేతుకమైన అధికారయ్తంరాంగం లేకపోవడంతో జనవరినుంచి కేసు పెండింగ్‌లోనే కొనసాగుతోందని సంజీత్‌వెల్లడించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/national/