చంద్రబాబును అదుపులోకి తీసుకున్నపోలీసులు

Visakhapatnam: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును నిర్బంధించారు.
ఉత్తరాంధ్రలో పర్యటన కోసం విశాఖ వచ్చిన చంద్రబాబును వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ ముందు పడుకుని కాన్వాయ్ కదలకుండా అడ్డుకున్నారు.
దాదాపు మూడు గంటలకు పైగా చంద్రబాబు తన వాహనంలో ఉండిపోయారు. తరువాత ఆయన కిందకు దిగి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని బలవంతంగా విమానాశ్రయం లాంజ్‌లోకి తీసుకెళ్లి నిర్బంధించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/