ఆ ఆడియో టేపు నకిలీది

తుమ్మలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు

Thummala Nageswara Rao
Thummala Nageswara Rao

ఖమ్మం: మాజీ మంత్రి, టిఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినట్లుగా ఉన్న ఓ ఆడియో టేపు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంది. ఈ ఆడియోలో ఆయన ఏపి రాజధాని తరలింపు, కమ్మ, రెడ్డి కులాలను ఉద్దేశించి సంభాషించినట్లుగా ఉంది. ఈ క్రమంలో ఈ ఆడియో టేపు నకిలీది అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి పోలీసు స్టేషన్‌లో పలువురు టిఆర్‌ఎస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఉద్దేశంపూర్వకంగా తుమ్మలపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఈ ఆడియోలో తెలంగాణ సిఎం కెసిఆర్‌, టిడిపి అధినేత చంద్రబాబు, ఏపి సిఎం జగన్‌, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నందమూరి బాలకృష్ణల గురించి కూడా ఇందులో వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆడియోపై తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటి వరకూ స్పందిచకపోవడం గమనార్హం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/