యామినిపై పోలీసు కేసు
టీటీడీ విజిలెన్స్ విభాగం ఫిర్యాదు

Tirumala: ఏపీ బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు నమోదైంది.
అయోధ్య రామాలయ నిర్మాణం భూమిపూజ ప్రత్యక్ష ప్రసారం చేయలేదని టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమెపై టీటీడీ విజిలెన్స్ విభాగం తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు సాధినేని యామినిపై ఐపిసి సెక్షన్ 505(2), 500 కింద కేసు నమోదు చేశారు.
2019 ఎన్నికల ముందు వరకు పార్టీ అధికార ప్రతినిధిగా టీడీపీలో యాక్టీవ్ రోల్ పోషించారు సాధినేని యామిని.
ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిని చవిచూడటంతో…ఆ తర్వాతి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
కాగా సోషల్ మీడియా ద్వారా తాజా రాజకీయ పరిణామాలతో హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటూ ఉంటారు యామిని.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/