ప్రొఫెసర్ కోదండరాం ఫై పోలీసుల దాడి..వేసుకున్న దుస్తులు కూడా చినిగి పోయాయి

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు (సెప్టెంబర్ 27) భారత్‌బంద్ జరిగింది. కాంగ్రెస్, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ , వామపక్షాలు, వైసీపీ భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌కు ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) నుండి మద్దతు లభించింది. ఈ బంద్ లో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం కు ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

ఈ బంద్ లో పాల్గొన్న ఆయన పట్ల పోలీసులు చాలా దౌర్జన్యంగా వ్యవహరించారు. పోలీసులు ఆయనపై చేసిన దాడి లో దుస్తులు కూడా చినిగి పోయాయి. ఈ ఘటన అందరినీ కలిచి వేస్తోంది. ఈ ఘటనపై కాంగ్రెస్ మరియు వామపక్షాలు మండిపడ్డాయి. తెలంగాణ యోధుడు కోదండరాం సార్ పట్ల పోలీస్ ల అనుచిత ప్రవర్తన ఆక్షేపనీయమని…ఈ ఘటన పై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.

మరోపక్క దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతగా ముగిసింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన బంద్ సందర్భంగా అనేక జాతీయ, రాష్ట్ర రహదారులు మూత పడ్డాయి. అనేక మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లించాల్సి వచ్చింది. బంద్ ప్రభావం రైళ్ళపై కూడా పడింది. ఢిల్లీ నుంచి బయలుదేరే అనేక రైళ్లు రద్దు చేశారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌లో బంద్ ప్రభావం ఎక్కువగా కనిపించింది. భారతీయ బంద్ పూర్తిగా విజయవంతమైందని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికైత్ అన్నారు. ఇప్పుడు యునైటెడ్ కిసాన్ మోర్చా తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది.