తమ్మినేని కృష్ణయ్య హత్య లో నిందితల అరెస్టు

టిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు తమ్మినేని కృష్ణయ్య ను రెండు రోజుల కిందట ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. వారిలో ఏ2 రంజన్‌, ఏ4 గంజిస్వామి, ఏ5 లింగయ్య, ఏ6 బోడపట్ల శ్రీను, ఏ7 నాగేశ్వరరావు, ఏ8 నాగయ్య ఉన్నారు. ఇక, ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 కృష్ణ పరారీలో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున వీరిని ఏపీలో అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడైన తమ్మినేని కోటేశ్వర రావుతోపాటు జక్కంపూడి కృష్ణ అనే మరో నిందితుడు పరారీలోనే ఉన్నారు. వీరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం 8 మంది పోలీసులు కేసు నమోదు చేసారు.

నిందితులను పట్టుకోవడం కోసం ఏసీపీ శబరీష్ నాయకత్వంలో ఒక బృందం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లింది. మూడు రోజులపాటు పలు పాంత్రాల్లో గాలించిన అనంతరం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఖమ్మంకు తీసుకుని వచ్చి విచారణ జరపనున్నారు. వారు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగా కృష్ణయ్య హత్య కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఈ హత్య కేసులో ఇప్పటికే పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారని సమాచారం.

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్య.. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి వరుసకి సోదరుడు అవుతారు. ఈ నెల 15న గ్రామ సమీపంలో ఆయన్ను దుండగులు దారుణంగా హతమార్చారు. తమ్మినేని వీరభద్రం సోదరుడైన కోటేశ్వరరావు ప్రమేయంతోనే ఈ హత్య జరిగిందని కృష్ణయ్య కుటుంబీకులు ఆరోపించారు. ఆయన కుమారుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.