ఉత్తమ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉత్తమ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
Police arrested Uttam Kumar

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంజీరా నీటి పారుదల ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అంచనా వేసేందుకు వెళుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈవిషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రైతులు, పారిశ్రామిక కార్మికుల కడగండ్లను మరింత పెంచుతూ మంజీరా ప్రాజెక్టులో నీటిమట్టం అడుగంటుతోందని, ఈ నేపథ్యంలో తాను ప్రాజెక్టు వద్దకు వెళుతుంటే అడ్డుకున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్‌ కు ఎందుకంత భయమో అర్థం కావడంలేదని, తనను మూడ్రోజుల వ్యవధిలో రెండుసార్లు అరెస్ట్ చేశారని మండిపడ్డారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/