హైదరాబాద్‌ మోడల్‌ కేసులో తప్పెవరిది?

Hyderabad model rape case
Hyderabad model rape case

హైదరాబాద్‌: నగరంలో మోడల్‌ పెట్టిన కేసు విచారణలో తప్పు ఎవరిదనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులను ఆశ్రయించిన మోడల్‌ తను మొదటగా ఇచ్చిన ఫిర్యాదు మత్తులో ఉండగా ఇచ్చినదని, తాను అత్యాచారానికి గురయ్యానని ఫిర్యాదును మార్చడంతో పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు మోడల్‌ కూడా తమను మోసం చేసిందని, రూ. 20 లక్షలు డిమాండ్‌ చేస్తుందని నిందితుడి తల్లి ఆరోపించింది. తన కుమారుడు మైనర్‌ అని, ఆ మోడలే అతనిపై వలేసిందని ఆమె అన్నారు. డబ్బు కోసమే ఆమె తప్పుడు ఆరోపణలు చేస్తోందని చెప్పారు. అయితే తొలుత పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదు చేసిన మోడల్‌, దానితో తనకు తనకు సంబంధం లేదని అది మత్తులో ఉండగా జరిగిందని చెప్పింది. మరో కంప్లైంట్‌ ఇస్తానని తనకు మత్తు ఇచ్చి తనను అత్యాచారం చేశారని మరో ఫిర్యాదు ఇవ్వండంతో పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఆమె సెల్‌ ఫోన్‌ సంభాషణలను పరిశీలిస్తున్నామని, ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు అనంతరం వివరాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/