పోలవరం: 10 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల
గోదావరికి భారీగా వరద

Polavaram: గోదావరికి భారీగా వరద పెరగటంతో పోలవరం స్పిల్ వే నుంచి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 33 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. ఎగువ డ్యాం వద్ద నీటిమట్టం 35 మీటర్లకు చేరింది. ఇదిలావుండగా , పోలవరం ముంపు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వేలేరుపాడు మండలంలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/