వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి..కేంద్రం

పోలవరం పనులపై రాజ్యసభలో కనకమేడల ప్రశ్న

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా… వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయని కేంద్ర జలశక్తి సహాయ మంత్రి కటారియా తెలిపారు. ఈమేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సవరించిన షెడ్యూల్ మేరకు ఈ వివరాలను ఇస్తున్నామని ఆయన తెలిపారు.

పనుల వారీగా కటారియా వివరాలను వెల్లడించారు. స్పిల్ వే పనులు మే నాటికి, క్రస్టు గేట్ల పనులు ఏప్రిల్ నాటికి, కాఫర్ డ్యామ్ నిర్మాణం జూన్ కల్లా పూర్తవుతాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే సమయానికి భూ సేకరణ, పునరావాస పనులు కూడా పూర్తవుతాయని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/